Aamir Khan: 13 ఏళ్ల తర్వాత మాజీ భార్య దర్శకత్వం... నిర్మాతగా బాలీవుడ్ బడా స్టార్​

Amir khan turns producer for his former wife directorial

  • కిరణ్ రావు దర్శకత్వంలో వస్తున్న హిందీ చిత్రం లాపతా లేడీస్
  • నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆమిర్ ఖాన్
  • పెళ్లి కూతుళ్ల మిస్సింగ్ నేపథ్యంలో కామెడీ సినిమా

విడాకులు తీసుకున్న బాలీవుడ్ జంట ఆమిర్ ఖాన్, కిరణ్ రావు సినిమా కోసం మళ్లీ ఒక్కటయ్యారు. 13 ఏళ్ల తర్వాత కిరణ్ రావు మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్నారు.‘లాపతా లేడీస్‌’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2010లో వచ్చిన ‘దోబీ ఘాట్’ తర్వాత ఆమె డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. దీనికి ఆమిర్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్పర్శ్ శ్రీవాస్తవ్, నితాన్షీ గోయ‌ల్‌, ప్రతిభా ర‌త్న, ర‌వికిష‌న్ కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌‌ విడుదలైంది. 

కొత్తగా పెళ్లయిన ఓ జంట ట్రైన్‌లో ప్రయాణం చేస్తుండగా, భార్య కనిపించకుండా పోతుంది. పెళ్లి కూతురు మిస్సింగ్ అంటూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాడు.. ఫొటోలో ఆమె ముఖం పెళ్లి ముసుగుతో కప్పేసి ఉంటుంది. మరోవైపు అదే ట్రైన్‌లో మరో పెళ్లికూతురు కనిపించడం లేదంటూ మరో ఫిర్యాదు వస్తుంది. ఇలా పెళ్లి కూతుళ్ల మిస్సింగ్ చుట్టూ జరిగే కామెడీతో ఈ చిత్రం ఉంటున్నట్టు టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 5న విడుదల కానుంది.

More Telugu News