Mallikarjun Kharge: జీ-20 విందుకు తనను ఆహ్వానించకపోవడంపై మల్లికార్జున ఖర్గే స్పందన

Mallikarjuna Kharge on not inviting him to G20 gala dinner

  • దేశాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు
  • కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడికి రాని ఆహ్వానం
  • ఇలాంటి సమయంలో ఈ రాజకీయాలు చేయకుండా ఉండాల్సిందన్న ఖర్గే

జీ-20 సదస్సును పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము... దేశాధినేతలకు శనివారం ఏర్పాటు చేసిన విందుకు తనకు ఆహ్వానం రాకపోవడంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. జీ-20 సదస్సుకు భారత్ ప్రాతినిథ్యం వహిస్తున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఇలాంటి రాజకీయాలు చేయకుండా ఉండాల్సిందన్నారు. ఖర్గేను ఆహ్వానించకపోవడంపై పలువురు ఇతర నేతలు కూడా స్పందించారు.

ఖర్గేను విందుకు ఆహ్వానించకపోవడం సరైనది కాదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ముందస్తు కార్యక్రమాల కారణంగా తాను మాత్రం విందుకు హాజరు కావడం లేదన్నారు. ప్రతిపక్ష నేతను ఆహ్వానించకపోవడం ప్రజాస్వామ్యంపై దాడిగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి బూపేశ్ అన్నారు.

Mallikarjun Kharge
Congress
g20
BJP
Narendra Modi
  • Loading...

More Telugu News