Kesineni Nani: చంద్రబాబు అరెస్ట్ పై రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి కేశినేని నాని లేఖ

Kesineni Nani wrote Centre on Chandrababu arrest

  • స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబుపై ఆరోపణలు
  • నంద్యాలలో అరెస్ట్ చేసిన పోలీసులు
  • చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కేంద్రం పెద్దలకు లేఖ రాసిన కేశినేని నాని
  • సంబంధం లేని విషయాల్లో చంద్రబాబుపై కేసు పెట్టారని ఆరోపణ

టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఎంపీ కేశినేని నాని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు లేఖ రాశారు. చంద్రబాబు అరెస్ట్ తీరుతెన్నులను నాని తన లేఖలో కేంద్రం పెద్దలకు వివరించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబుపై కేసులు పెట్టారని కేశినేని నాని ఆరోపించారు. సంబంధం లేని విషయాల్లో చంద్రబాబుపై కేసులు నమోదు చేశారని వివరించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుపై ఆరోపణల నేపథ్యంలో ఏపీ సీఐడీ అధికారులు నంద్యాలలో చంద్రబాబును అదుపులోకి తీసుకోవడం తెలిసిందే.

Kesineni Nani
Chandrababu
Arrest
President Of India
Prime Minister
Home Minister
Letter
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News