Chandrababu: చంద్రబాబు తరఫున రంగంలోకి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా

Supreme Court senior lawyer to support Chandrababu
  • ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న సిద్ధార్థ లూథ్రా
  • కాసేపట్లో సిట్ కార్యాలయానికి చంద్రబాబు  
  • అనంతరం కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు  
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తరఫున కోర్టులో వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రంగంలోకి దిగారు. టీడీపీ అధినేత తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. లూథ్రా తన బృందంతో ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన విజయవాడ ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత తరఫున బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపిస్తారు. టీడీపీ అధినేత కేసులను సిద్ధార్థ లూథ్రానే చూస్తున్నారు. గతంలో అమరావతి భూముల కేసులను వాదించారు. మరోవైపు సిట్ తరఫున ఏఏజీ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. చంద్రబాబును మరికాసేపట్లో విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు. తొలుత ఆయనను సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి, ఆ తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు.
Chandrababu
Supreme Court
lawyer
Andhra Pradesh

More Telugu News