kiran abbavaram: నవ్వులు పంచే ‘రూల్స్ రంజన్’

Rules Ranjan Trailer releases

  • కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న చిత్రం
  • హీరోయిన్‌గా నటించిన నేహా శెట్టి
  • నిన్న ట్రైలర్ విడుదల చేసిన సినిమా యూనిట్

యువ నటుడు కిరణ్‌ అబ్బవరం వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. అతను హీరోగా, నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’. రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏ. ఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్‌ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 28న విడుదల కానుంది. ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌ ఆద్యంతం వినోదభరితంగా ఉంది. కిరణ్ తన మార్కు కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. ‘ప్రతి తండ్రి నన్ను చూసి నేర్చుకోవాల. అమ్మ పాలిచ్చి పెంచుద్ది, అయ్య మందిచ్చి ఓదార్చాల. చెప్పు నాన్న ఏం తాగుతావు?’ అని కిరణ్ తండ్రిగా నటించిన గోపరాజు రమణ  డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. 

రంజన్ (కిరణ్), సనా (నేహా)  కలిసి కాలేజ్‌లో చదువుకున్న చాలాకాలం తరువాత కలవడంతో ఆమె మెప్పించడానికి రూల్స్ రంజన్‌లా ఉండే  మనో రంజన్ కాస్తా పబ్ రంజన్ గా మారడం ఆసక్తికరంగా ఉంది. హీరో స్నేహితులుగా నటించిన వెన్నెల కిషోర్, హైపర్ ఆది, హర్ష, సుదర్శన్‌ కాంబినేషన్‌లో వచ్చే కామెడీ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.  పాత్రల మధ్య సరదా సంభాషణలు, మాటల తూటాలతో మంచి వినోదం పంచేలా ఉన్నాయి.  అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలను అద్భుతమైన స్పందన లభించింది.

More Telugu News