Daggubati Purandeswari: మీరెందుకు తెగ బాధపడిపోతున్నారు?: పురందేశ్వరికి వైసీపీ కౌంటర్

YCP counters Purandeswari after she supported Chandrababu
  • స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఆరోపణలపై చంద్రబాబు అరెస్ట్
  • నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారన్న పురందేశ్వరి
  • ప్రొసీజర్ ఫాలో కాలేదని విమర్శలు
  • మీ బావగారు కాబట్లే ఇలా మాట్లాడుతున్నారా? అంటూ వైసీపీ ప్రశ్న 
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్ ను ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ఖండించిన సంగతి తెలిసిందే. నోటీసులు ఇవ్వకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం సరికాదని పురందేశ్వరి పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ అంశంలో ప్రొసీజర్ ఫాలో కాలేదని ఆరోపించారు. 

దీనిపై వైసీపీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా తీవ్రంగా స్పందించింది. "మీరెందుకు అంత బాధపడిపోతున్నారు... మీ బావగారనా?" అంటూ కౌంటర్ ఇచ్చింది. 

"ఇంతకీ మీరు రాష్ట్రాధ్య‌క్షురాలిగా ఉన్న‌ది ఏపీ బీజేపీకా లేక తెలుగుదేశం పార్టీకా? వందల కోట్ల అవినీతికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే, దానిపై మీ స్పందన చూసిన వారెవరికైనా ఇలాంటి సందేహమే కలుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు ఏ1 నిందితుడు. ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అందుకే అరెస్ట్ చేశారు. మీకెందుకు బాధ!" అంటూ వైసీపీ ఘాటుగా విమర్శించింది.
Daggubati Purandeswari
Chandrababu
Arrest
YSRCP
BJP
TDP
Andhra Pradesh

More Telugu News