Devineni Uma: అక్రమ గృహ నిర్బంధాలు, అరెస్టులకు కారకుడు సజ్జలే: దేవినేని ఉమ

Devineni Uma slams Sajjala

  • నంద్యాలలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్
  • టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు
  • ముందు జాగ్రత్తగా టీడీపీ నేతల గృహనిర్బంధం
  • సజ్జల పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతోందన్న ఉమ
  • చంద్రబాబు అరెస్ట్ కు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిక

నంద్యాలలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడ్ని అరెస్ట్ చేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. అయితే, ముందుజాగ్రత్తగా పోలీసులు ఎక్కడికక్కడ టీడీపీ నేతలు గృహనిర్బంధం చేస్తున్నారు. కొందరు నేతలను పీఎస్ లకు తరలిస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడ భవానీపురం పీఎస్ కు తరలించారు. 

చంద్రబాబు అరెస్ట్ పై ఉమ తీవ్రంగా స్పందించారు. తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షణలోనే అక్రమ గృహ నిర్బంధాలు, అరెస్టుల పర్వం సాగుతోందని ఆరోపించారు. ఇలా వేలమంది పోలీసులతో టీడీపీ నేతలను నిర్బంధిస్తుండడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి అని ఉమ పేర్కొన్నారు. దీనికంతటికీ కారకుడు సజ్జలేనని మండిపడ్డారు. 

చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ కార్యకర్తలే కాకుండా, సాధారణ ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. సీఎం జగన్ కళ్లలో ఆనందం కోసమే పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఉమ విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ కు రాబోయే రోజుల్లో తగిన ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు.

Devineni Uma
Chandrababu
Arrest
Sajjala Ramakrishna Reddy
TDP
Jagan
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News