Rakul Preet Singh: బెంజ్ కారు ముచ్చట తీర్చుకున్న రకుల్ ప్రీత్

Rakul Preet Singh bought new car

  • కొత్త కారు కొనుక్కున్న రకుల్ ప్రీత్ సింగ్
  • తన ఇంట బెంజ్ కారుతో ఫొటోలకు పోజులు
  • అందరికీ స్వీట్స్ పంచిన అమ్మడు 

పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ కొత్త కారు ముచ్చట తీర్చుకుంది. ఎప్పటినుంచో కొనాలనుకుంటున్న మెర్సిడెస్ బెంజ్ కారును ఇన్నాళ్లకు కొనేసింది. మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ జీఎల్ఎస్ మోడల్ కారుతో రకుల్ తన ఇంట ఫొటోలకు పోజిచ్చింది. తన మనసుకు నచ్చిన కారును కొన్న సందర్భంగా ఈ బ్యూటిఫుల్ భామ మిఠాయిలు పంచి సందడి చేసింది. 

కాగా ఈ కారు ఖరీదు రూ.3 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. కొన్నాళ్లుగా తెలుగు చిత్రపరిశ్రమకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ఉత్తరాదిన క్రేజ్ పెంచుకునే పనిలో ఉంది.

Rakul Preet Singh
New Car
Mercedes Benz Maybach GLS
Actress
Bollywood
Tollywood
  • Loading...

More Telugu News