america: ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్

US President Joe Biden reaches Delhi

  • నేటి సాయంత్రం భారత్‌కు చేరుకున్న జోబైడెన్
  • అధ్యక్ష హోదాలో మొదటిసారి భారత్‌కు రాక
  • తన నివాసంలో ప్రయివేటు డిన్నర్ ఏర్పాటు చేసిన మోదీ

ఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ చేరుకున్నారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఆయన ఢిల్లీలో దిగారు. ఈ రోజే ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అధ్యక్ష హోదాలో మొదటిసారి భారత్‌కు వచ్చిన బైడెన్ ద్వైపాక్షిక చర్చల కోసం ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడికి ప్రధాని మోదీ ప్రయివేటు డిన్నర్ ఏర్పాటు చేయడం గమనార్హం. ఇంత వరకు ఏ దేశ అధినేతకు ప్రధాని ప్రయివేటు డిన్నర్ ఇవ్వలేదు. ద్వైపాక్షిక చర్చలు, డిన్నర్ తర్వాత బైడెన్ హోటల్ మౌర్యకు వెళ్తారు.

america
Joe Biden
Narendra Modi
g20
  • Loading...

More Telugu News