Narendra Modi: మోదీ, జో బైడెన్ ల ప్రత్యేక సమావేశం ఎక్కడ జరగబోతోందంటే..!

Modi and Joe Biden to meet in PMs official residence

  • సాయంత్రానికి ఢిల్లీకి చేరుకోనున్న జో బైడెన్
  • ప్రధాని అధికారిక నివాసంలో మోదీ, బైడెన్ ల సమావేశం
  • భేటీ అనంతరం ప్రైవేట్ విందును ఇస్తున్న ప్రధాని

ఢిల్లీలో జీ20 సమావేశాల హడావుడి ప్రారంభమయింది. ఇప్పటికే పలు దేశాల అధినేతలు ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హస్తినలో అడుగుపెడతారు. అనంతరం ప్రధాని మోదీతో బైడెన్ ప్రత్యేకంగా సమావేశమవుతారు. వీరి సమావేశం ప్రధాని మోదీ అధికారిక నివాసంలో జరగనుంది. సమావేశానంతరం బైడెన్ కు మోదీ ప్రైవేట్ డిన్నర్ ఇవ్వనున్నారు. 

మరోవైపు, వీరి సమావేశానికి సంబంధించిన అజెండాలో పలు కీలక అంశాలు ఉన్నాయి. న్యూక్లియర్ టెక్నాలజీ, జీఈ జెట్ ఇంజిన్లు, ప్రిడేటర్ డ్రోన్లు, 5జీ/6జీ స్పెక్ట్రమ్ తదితర కీలక అంశాలపై వీరు చర్చించనున్నారు. ఇంకోవైపు, విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత బైడెన్ నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

Narendra Modi
BJP
Joe Biden
USA
Meeting
  • Loading...

More Telugu News