CPI Narayana: తెలంగాణ ఎన్నికలు.. కేసీ వేణుగోపాల్ తో సీపీఐ నారాయణ భేటీ

CPI Narayana meets KC Venugopal

  • కమ్యూనిస్టులను  దూరం పెట్టిన కేసీఆర్
  • కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న కామ్రేడ్లు
  • సీపీఐ, సీపీఎంలకు చెరో రెండు సీట్లు ఇచ్చే అవకాశం

ఈ ఏడాది చివర్లోగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవలి కాలంలో కమ్యూనిస్టులతో స్నేహం చేసిన కేసీఆర్... ఇప్పుడు మళ్లీ వాళ్లను దూరం పెట్టారు. కమ్యూనిస్టులకు కేసీఆర్ ఒక్క సీటును కూడా కేటాయించలేదు. దీంతో కాంగ్రెస్ వైపు కమ్యూనిస్టులు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో సీపీఐ నారాయణ భేటీ అయ్యారు. పొత్తులు, సీట్ల కేటాయింపుపై వీరు చర్చించినట్టు సమాచారం.

 ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ చర్చలు సఫలమయినట్టు చెప్పారు. ఒకటి, రెండు రోజుల్లో సీపీఎం జాతీయ నేతలతో కాంగ్రెస్ నేతలు చర్చలు చేయనున్నారు. ఇంకోవైపు సీపీఐ, సీపీఎం పార్టీలకు గెలవగలిగిన స్థానాల్లో చెరొక సీటు కేటాయించే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం. అయితే కమ్యూనిస్టులు చెరో మూడు సీట్లను కోరుతున్నట్టు తెలుస్తోంది. చివరకు చెరో రెండు సీట్లు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

CPI Narayana
Congress
Telangana
KC Venugopal
  • Loading...

More Telugu News