Andhra Pradesh: చంద్రబాబు నిప్పో తుప్పో నాకన్నా మీకే తెలుసు.. ప్రజలకు ఇంకా బాగా తెలుసు: ప్రెస్ మీట్ లో అంబటి రాంబాబు

AP Minister Ambati Rambabu Press Meet

  • గుంటూరులో గురువారం మంత్రి ప్రెస్ మీట్
  • చంద్రబాబును అరెస్టు చేస్తారా అంటూ విలేకరి ప్రశ్న
  • రైతులకు సూచనలు చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామన్న మంత్రి
  • నాగార్జున సాగర్ ఆయకట్టులో ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచన
  • రాజకీయాలు మరోసారి మాట్లాడుకుందామంటూ వ్యాఖ్య
  • చంద్రబాబుపై సెటైర్లు వేస్తూ ప్రెస్ మీట్ ముగింపు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నిప్పో తుప్పో నాకన్నా మీకే బాగా తెలుసంటూ విలేకరులతో వ్యాఖ్యానించారు. వార్తలు చూస్తున్న జనాలకు ఇంకా బాగా తెలుసని చెప్పారు. గురువారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. 

సాగునీటి శాఖ బాధ్యతలు చూస్తున్న మంత్రి అంబటి.. నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకు పలు సూచనలు చేసేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సాగర్ ఆయకట్టు కింద ఈసారి ఆరుతడి పంటలు వేసుకోవాలని, వరి పంట వేయొద్దని చెప్పారు. నాగార్జున సాగర్ నీటిపై ఆధారపడిన భూముల్లో ఆరుతడి పంటలు వేసుకోవడం తప్ప శరణ్యం లేదని చెప్పారు. వారాబంది పద్ధతిలో నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. దీనిపై ఈ నెల 1న ముఖ్యమంత్రి జగన్ ను కలిసి మాట్లాడినట్లు వివరించారు.

మంత్రి మాట్లాడుతుండగా ఓ మీడియా సంస్థ ప్రతినిధి చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. చంద్రబాబును అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించారు. మంత్రి అంబటి స్పందిస్తూ.. ప్రస్తుతం రైతులు నష్టపోకుండా ముందస్తుగా హెచ్చరించేందుకే ఈ సమావేశం పెట్టామని చెప్పారు. రాజకీయాల గురించి మరోమారు మాట్లాడుకుందామని అంటూనే.. చంద్రబాబు నిప్పో తుప్పో మీకు తెలుసు, చూసే ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
minster ambati
Ambati Rambabu
YSRCP
Chandrababu
Nagarjuna sagar

More Telugu News