Shahrukh Khan: షారుక్ ఖాతాలో మరో బ్లాక్​బస్టర్​ పడినట్టే.. జవాన్​కు అదిరిపోయే రేటింగ్​!

Taran adarsh predicts Jawan going to be Mega blockbuster
  • భారీ అంచనాలతో ఈ రోజే విడుదలైన చిత్రం
  • 4.5 రేటింగ్ ఇచ్చిన ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్
  • ఇప్పటికే పఠాన్‌తో సక్సెస్‌ సాధించిన షారుక్
ఈ ఏడాది సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన సినిమాల్లో ‘జవాన్’ఒకటి. షారుక్ ఖాన్, నయనతార జంటగా అట్లీకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాలతో ఈ రోజు విడుదలైంది. రిలీజ్‌కు ముందు అడ్వాన్స్‌డ్‌ బుకింగ్స్‌లో రికార్డు సృష్టించిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఇప్పటికే ‘పఠాన్‌’ చిత్రంతో హిట్ సొంతం చేసుకున్న షారుక్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరిందని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ అంచనా వేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని రివ్యూ ఇచ్చిన ఆయన 4.5 రేటింగ్ ఇచ్చారు. ఈ మాస్ మసాలా ఎంటర్‌‌టైనర్‌‌ షారుక్‌ కెరీర్‌‌లో గుర్తిండిపోయేలా ఉందన్నారు.  

‘దర్శకుడు అట్లీ.. షారుక్‌ను పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఈ పాత్రలో షారుక్ తన దమ్ము చూపెట్టారు. పఠాన్‌తో పాటు ఈ చిత్రం కూడా అభిమానుల హృదయాలతో పాటు బాక్సాఫీస్ ను బద్దలు కొట్టనుంది. పదునైన స్క్రీన్‌ప్లే, అందరినీ కట్టిపడేసే ఎపిసోడ్స్, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులు, భారీ తారాగణం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గొప్పగా ఉంది. మరీ ముఖ్యంగా షారుక్, విజయ్ సేతుపతి క్యారెక్టర్లు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ ఇద్దరితో పాటు నయనతార, దీపికా పదుకొణే, సంజయ్ దత్ అద్భుతంగా నటించారు’ అని తరణ్ పేర్కొన్నారు.
Shahrukh Khan
Jawan Movie
Nayanthara
Deepika Padukone
Vijay Sethupathi
review

More Telugu News