Health Benefits: నిద్రకు ముందు పసుపు కలిపిన పాలు సేవిస్తే ఎన్నో లాభాలు
- పసుపులో ఎన్నో ఆరోగ్య సుగుణాలు
- ఇన్ ఫ్లమ్మేషన్ నుంచి ఉపశమనం
- రక్తాన్ని శుద్ధి చేసే సామర్థ్యం
పసుపు కలిపిన పాలను తాగడం అన్నది ఎన్నో తరాల నుంచి ఉంది. దీన్ని గోల్డెన్ మిల్క్ అని కూడా పిలుస్తారు. దీన్ని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. తమ ఆరోగ్యాన్ని సహజసిద్ధంగా పెంచుకోవాలని చూసే వారికి ఇదొక మంచి ఔషధం అవుతుంది.
- పసుపులో యాంటీ మైక్రోబయల్, రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు ఉన్నాయి. కనుక నిద్రించడానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో పసుపు కలుపుకుని తాగాలి. దీనివల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల మొత్తం మీద ఆరోగ్యం పటిష్ఠమవుతుంది.
- పసుపులో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీలు ఉంటాయి. కనుక వ్యాధి నిరోధక శక్తి బలంగా మారడానికి ఇవి తోడ్పడతాయి.
- పసుపుకు రక్తాన్ని శుద్ధి చేసే సామర్థ్యం కూడా ఉంది. పసుపులోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బరువు తగ్గేందుకు అనుకూలిస్తాయి.
- చర్మం ఆరోగ్యానికి పసుపు మంచిది. వయసు పెరుగుతున్న దశలో చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. ముఖ్యంగా పుసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యంలోని వారికి ఎంతో అవసరం.
- పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది. గాల్ బ్లాడర్ లో బైల్ తయారికి సాయపడుతుంది.
- పసుపులో యాంటీ ఇన్ ఫ్లమ్మేషన్ ప్రాపర్టీలు కూడా ఉన్నాయి. దీంతో రోజు రాత్రి పసుపు పాలను తాగడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.