Tirumala: తిరుమలలో చిక్కిన మరో చిరుత

Another leopard caught on Tirumala alipiri road
  • నాలుగు రోజుల క్రితం చిరుతను గుర్తించిన అధికారులు 
  • అలిపిరి-తిరుమల నడకమార్గంలో కొత్తమండపం వద్ద తాజాగా బోనులో చిక్కిన వైనం
  • ఇప్పటివరకూ మొత్తం ఐదు చిరుతల పట్టివేత
తిరుమలలో మరో చిరుత చిక్కింది. నాలుగు రోజుల క్రితం కెమెరా కంట్లో పడ్డ ఈ చిరుతను తాజాగా బంధించారు. అలిపిరి-తిరుమల నడకమార్గంలో కొత్త మండపం వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఇది చిక్కింది. దీంతో, ఈ రెండు నెలల కాలంలో మొత్తం ఐదు చిరుతలు అటవీశాఖ అధికారులకు చిక్కినట్టయింది.  

ఇటీవల అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో నెల్లూరుకు చెందిన ఆరేళ్ల బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో, అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు తిరుమల కొండల్లో పలు చోట్ల బోనులు ఏర్పాటు చేసి చిరుతలను బంధిస్తున్నారు.
Tirumala
leopard
Alipiri

More Telugu News