Chandrababu: బాంబులకే భయపడని నేను వైసీపీకి భయపడతానా?: చంద్రబాబు

Chandrababu in Anantapur district

  • కల్యాణదుర్గంలో 'బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమంలో పాల్గొన్న  టీడీపీ అధినేత
  • జగన్ రివర్స్ మనిషి.. రివర్స్ టెండర్లతో ఇరిగేషన్‌ను నాశనం చేశాడని ఆరోపణ
  • అనంతపురం టీడీపీ కంచుకోట అన్న చంద్రబాబు
  • మద్య నిషేధం చేయకుంటే ఓట్లు అడగనని ఇప్పుడు బాటిల్ ధరను రూ.60 నుండి రూ.200కు పెంచాడని ఆగ్రహం

రాష్ట్రం కోసం తాను దేనినీ లెక్క చేయనని, అలుపెరగని పోరాటం చేస్తానని, బాంబులకే బయపడని తాను వైసీపీ వాళ్లకు భయపడతానా అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన కళ్యాణదుర్గంలో 'బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఏం చేశాడో జగన్ చెప్పాలని నిలదీశారు. ఏమీ చేయనప్పుడు ఆయనకు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలన్నారు. కళ్యాణదుర్గంలో 114 చెరువులకు నీరు ఇచ్చే భైరవానితిప్ప ప్రాజెక్టును నాశనం చేసిన జగన్‌కు ఎందుకు ఓట్లు వేయాలన్నారు. టీడీపీ హయాంలో ఇరిగేషన్‌లో 12 వేల కోట్లు రాయలసీమకు ఖర్చు చేశామని, కానీ జగన్ కేవలం రూ.2వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు.

జగన్ ఒక రివర్స్ మనిషి... రివర్స్ టెండర్లతో ఇరిగేషన్ ను నాశనం చేశాడని దుయ్యబట్టారు. జగన్ రాష్ట్రంలో 192 ప్రాజెక్టులు రద్దు చేశాడని, సీమలో 102 ప్రాజెక్టులు, అనంతపురంలో 32 ప్రాజెక్టులు రద్దు చేసిన రాయలసీమ ద్రోహి ఈ జగన్ అని ఆరోపించారు. అనంతపురం జిల్లాకు న్యాయం చేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అన్నారు. ఆయన హంద్రీనీవాను ప్రారంభించారని, దాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంది తానే అన్నారు. గొల్లపల్లి ప్రాజెక్టును సవాల్‌గా తీసుకున్నానని, అలాగే కియా మోటార్స్ తీసుకు వచ్చామన్నారు. దీంతో 20 వేలమందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. కియా పరిశ్రమను చూస్తే అనంతపురంలో ఉన్నామా? అమెరికాలో ఉన్నామా? అనే భావన కలుగుతోందన్నారు. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికే ప్రతి ఎకరాకు నీరు వచ్చేదన్నారు. హంద్రీనీవా కాలువ వెడల్పు చేయాలని 35 శాతం పనులు పూర్తి చేస్తే వైసీపీ నాశనం చేసిందన్నారు. ఈసారి వర్షాభావం కారణంగా పంటలు పూర్తిగా  దెబ్బతిన్నాయని, ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఒక్క రూపాయి సహాయం అయినా చేసిందా? అని ప్రశ్నించారు.

అనంతపురం తెలుగుదేశం పార్టీ కంచుకోట అని, ఈ పార్టీ బీసీల పార్టీ అన్నారు. ఈ ప్రభుత్వంలో ఏ బీసీకి అయినా న్యాయం జరిగిందా? అని ప్రశ్నించారు. జగన్ వచ్చాడు ముద్దులు పెట్టాడు... నేడు పిడిగుద్దులు గుద్దుతున్నాడని ఎద్దేవా చేశారు. జగన్‌కు ఇచ్చిన ఒక్క చాన్స్ ఇక ఆఖరి చాన్స్ కావాలని పిలుపునిచ్చారు. ఈ అయిదేళ్ల కాలంలో ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? తమ ఆదాయం పెరిగిందని ఒక్కరైనా చెప్పగలరా? అన్నారు. ఈ ప్రభుత్వం బాగా చేసిందని ఎవరైనా చెబితే ఇక తను మాట్లాడను కూడా మాట్లాడనన్నారు. 

తాజాగా ఓ దద్దమ్మ మంత్రి మాట్లాడుతూ గురువు కంటే గూగుల్ గొప్ప అంటున్నాడని, ఈ దద్దమ్మకు ఏం తెలుసు? చదువు చెప్పేది గురువు అని విమర్శలు గుప్పించారు. తెలుగుదేశంలో ఉన్న బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని, 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో ఉన్న 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించాడన్నారు. నాడు ఆదరణ ద్వారా ఆధునిక పనిముట్లు ఇచ్చానని, వాటిని కూడా ఈ సైకో పంపిణీ చేయలేదన్నారు. నాడు టీటీడీ బోర్డు చైర్మన్ పదవి, యూనివర్సిటీ వీసీలుగా బీసీలను నియమించిన పార్టీ టీడీపీ అన్నారు. అదే సమయంలో దళితులను మోసం చేసిన పార్టీ వైసీపీ అన్నారు. దళిత పథకాలను తీసేసిన దుర్మార్గపు పార్టీ వైసీపీ అన్నారు.

తూర్పు గోదావరిలో ఒక ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ ను చంపి ఇంటికి డోర్ డెలివరీ చేశారన్నారు. యువతకు ఉద్యోగం వచ్చిందా? అని ప్రశ్నించారు. నాడు 16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి, 5.20 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కానీ జగన్ కనీసం ఒక్క డీఎస్సీ పెట్టలేదని, ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదన్నారు. నేడు మీ ఊళ్లో ఇసుక మీకు దొరకడం లేదని, కానీ పక్క రాష్ట్రాలకు తరలించి అమ్ముకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక దొంగలు వైసీపీ నేతలే అన్నారు. ఇసుకలో రూ.40 వేల కోట్లు దోచుకున్న ఇసుకాసురుడు ఈ సైకో జగన్ అని దుయ్యబట్టారు. మద్యపాన నిషేదం చేస్తానన్న జగన్ ఇప్పుడు ఏం చేశాడని ప్రశ్నించారు. మద్య నిషేధం చేయకుంటే ఓట్లు అడగనన్న వ్యక్తి క్వార్టర్ బాటిల్ ధరను రూ.60 నుండి రూ.200కు పెంచాడన్నారు.

ఏపీలో ఉండే బ్రాండ్లు మరెక్కడా ఉండవని, ఇవన్నీ వైసీపీ సొంత బ్రాండ్లు అన్నారు. బ్రాందీ షాపుల బిల్లు ఎందుకివ్వడం లేదని అడగాలన్నారు. తోపుడు బండిలో కూడా ఫోన్ పే చేయవచ్చునని, కానీ మద్యం షాపులో ఎందుకు తీసుకోరో చెప్పాలన్నారు. మీ రక్తం తాగే జలగ ఈ సైకో జగన్ అన్నారు. దేశంలోనే పెట్రోల్ డీజిల్ ఎక్కువ రేట్లు ఉన్న రాష్ట్రం మనదే అన్నారు. నిత్యావసర వస్తువులు, నూనె ధరలు పెరిగాయని, కరెంట్ చార్జీలు విపరీతంగా పెంచారన్నారు. కరెంట్ ఛార్జీలను ఎనిమిదిసార్లు పెంచారని, టీడీపీ హయంలో ఒక్కసారి కూడా పెంచలేదన్నారు.

ఈ జగన్ అవినీతి వల్ల అసమర్థత వల్ల రూ.200 బిల్లు రూ.1000 అయ్యిందని, రూ.2 వేల బిల్లు రూ. 5 వేలు అయిందన్నారు. ప్రతి ఇంటిపై ఏడాదికి 8 వేల నుంచి 50 వేల భారం పడుతోందన్నారు. ఈ సైకో జగన్ పోతేనే కరెంట్ చార్జీలు తగ్గుతాయన్నారు. కరెంట్ విషయంలో సంస్కరణలు తెచ్చింది తానే అని, మళ్లీ సోలార్, విండ్ ఎనర్జీ తెచ్చి కరెంట్ చార్జీలు తగ్గించే బాధ్యత కూడా తనదే అన్నారు. జగన్ కు భయం పట్టుకుంది అందుకే యువగళంపై పడ్డాడన్నారు. పుంగనూరులో తనపై హత్యాయత్నం చేసినప్పటికీ, తిరిగి తనపైనే కేసులు పెట్టారన్నారు. దీనికి తాను భయపడాలా? అని నిలదీశారు. నాపై కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కానీ మీరెంటి కేసులు పెట్టేది.. తాను నిప్పులా ఉన్నానన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 26 కేసులు  పెట్టారన్నారు., అవినీతి పార్టీ వైసీపీ, నీతివంతమైన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు.

'చంద్రబాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ' కింద సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినట్లు చెప్పారు. కళ్యాణదుర్గంలో ఉన్న మంత్రి 160 ఎకరాలు కొట్టేశారని, ఎకరా లక్షకే కొట్టేశాన్నారు. తాను లక్ష ఇస్తానని, ఆ ధరకు 160 ఎకరాలు ఇస్తారా చెప్పాలన్నారు. మీరు రూ.1 లక్షకే ఇస్తే వాటిని పేదలకు కొని ఇస్తానన్నారు. ఇక్కడ ఉన్న సుబేదార్ చెరువును కబ్జా చేస్తే మీ ఇంచార్జ్ కోర్టుకు పోయి స్టే తీసుకు వచ్చాడన్నారు. నదుల్లో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఎవరైనా లే అవుట్ వేస్తే ఎకరాకు 10 లక్షలు ఇవ్వాలన్నారు. పేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పి ఎకరా రూ.6 లక్షలకు కొని ప్రభుత్వానికి రూ.25 లక్షలకు విక్రయించారన్నారు. నియోజకవర్గంలో హంద్రీనీవా ద్వారా 114 చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత తనదేనని, టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కూడా పెట్టిస్తామన్నారు.

  • Loading...

More Telugu News