Ramcharan: ప్రభాస్ ఛాలెంజ్ కు రామ్ చరణ్ స్పందన.. నెల్లూరు చేపల పులుసు ఇష్టమని వెల్లడి.. తదుపరి ఛాలెంజ్ ఎవరికంటే..?

Ramcharan recipe challenge to Rana

  • రేపు విడుదల అవుతున్న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'
  • రెసిపీ ఛాలెంజ్ పేరుతో సినిమా ప్రమోషన్ చేస్తున్న అనుష్క శెట్టి
  • తన ఛాలెంజ్ ను రానాకు విసిరిన రామ్ చరణ్

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. ఈ చిత్రం పెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో అనుష్క ఒక చెఫ్ పాత్రలో కనిపించనుంది. ఈ నేపథ్యంలో ఆమె ఈ సినిమాకు వెరైటీగా ప్రమోషన్ ను ప్రారంభించింది. రెసిపీ ఛాలెంజ్ పేరుతో కొత్త ఛాలెంజ్ ను ప్రారంభించింది. తనకు ఇష్టమైన చికెన్ కర్రీ, నీర్ దోశ ఎలా చేయాలో తెలుపుతూ ట్వీట్ చేసింది. ఆ తర్వాత ప్రభాస్ కు చాలెంజ్ విసిరింది. తనకు ఇష్టమైన వంటకాన్ని అందరితో పంచుకున్నానని... ఇప్పుడు ఛాలెంజ్ ను ప్రభాస్ కు విసురుతున్నానని చెప్పింది. 

ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రభాస్ తనకు రొయ్యల పులావ్ అంటే చాలా ఇష్టమని తెలిపాడు. దాన్ని ఎలా చేయాలో పంచుకున్నాడు. తర్వాత రామ్ చరణ్ కు ఛాలెంజ్ విసిరాడు. ఈ ఛాలెంజ్ కు చరణ్ స్పందించాడు. తనకు నెల్లూరు చేపల పులుసు అంటే చాలా ఇష్టమని చెప్పాడు. దాని తయారీ విధానాన్ని తెలియజేశాడు. రానా దగ్గుబాటికి తదుపరి సవాల్ విసిరాడు. రేపు రిలీజ్ అవుతున్న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపాడు.

Ramcharan
Chepala Pulusu
Prabhas
Rana Daggubati
Tollywood

More Telugu News