Rohit Sharma: కెప్టెన్‌గా తన పేరును ప్రకటించిన సమయంలో రోహిత్ శర్మ రియాక్షన్!

Rohit Sharmas Reaction To Being Named Cricket World Cup 2023 Captain Goes Viral

  • నిన్న 15 మందితో కూడిన జట్టును ప్రకటించిన అగార్కర్
  • వన్డే ప్రపంచ కప్ కోసం కెప్టెన్‌గా రోహిత్ పేరును ప్రకటించిన అగార్కర్
  • తన పేరు చదవగానే చేయి పైకెత్తి హే అంటూ ఆనందం వ్యక్తం చేసిన రోహిత్ శర్మ

వన్డే ప్రపంచ కప్ కోసం నిన్న భారత జట్టును ప్రకటించిన సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ రియాక్షన్ నెట్టింట వైరల్‌గా మారింది. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్, రోహిత్ శర్మ సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి, పదిహేను మందితో కూడిన జట్టును ప్రకటించారు. ఒక్కొక్కరి పేరును అగార్కర్ చదివి వినిపించారు. ఈ జాబితాలో కెప్టెన్ పేరు మొదట వచ్చింది. అగార్కర్ తన పేరు చదవగానే పక్కనే ఉన్న రోహిత్ ఒక్కసారిగా చేయి పైకెత్తి హే... అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు సరదాగా పోస్టులు పెడుతున్నారు.

More Telugu News