DK Aruna: ఎమ్మెల్యేగా తన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని కోరిన డీకే అరుణ

DK Aruna meets assembly secretary

  • సీఈసీ లేఖ ప్రతితో అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన డీకే అరుణ
  • కేంద్ర ఎన్నికల సంఘం కాపీని అందించినట్లు వెల్లడి  
  • సభాపతికి సందేశం పంపించానన్న బీజేపీ నాయకురాలు

తనను గద్వాల ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ బీజేపీ నాయకురాలు డీకే అరుణ మంగళవారం స్పీకర్ కార్యాలయంలో లేఖ ఇచ్చారు. అసెంబ్లీ కార్యదర్శితో ఆమె సమావేశమై కేంద్ర ఎన్నికల సంఘం లేఖ ప్రతిని సమర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... వీలైనంత తొందరగా తన ప్రమాణస్వీకార ఏర్పాట్లు చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని కోరినట్లు తెలిపారు.

అసెంబ్లీ సెక్రటరీ అందుబాటులో ఉంటే లేఖ ఇచ్చానని, కేంద్ర ఎన్నికల సంఘం కాపీని కూడా అందించినట్లు తెలిపారు. సభాపతి కార్యాలయంలో అందుబాటులో లేరని, అందుకే వారికి సందేశం పెట్టినట్లు చెప్పారు. ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదన్నారు. అందుకే మెసేజ్ పంపినట్లు వెల్లడించారు. వారిని కూడా ప్రమాణ స్వీకారానికి సమయం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.

DK Aruna
BJP
Telangana
  • Loading...

More Telugu News