Warren Buffett: 93 ఏళ్ల వారెన్ బఫెట్ ఆరోగ్య రహస్యం అదేనా..?

93 year old Warren Buffett has 5 cans of coke every day
  • తనకు సంతోషాన్నిచ్చే ఆహారాన్ని తీసుకుంటానన్న బఫెట్
  • సంతోషంగా ఉంటే ఎక్కువ కాలం జీవించొచ్చన్న తత్వం
  • రోజుకు ఐదు కోక్ లు, చికెన్ నగ్గెట్స్ బఫెట్ మెనూలో భాగం
ప్రపంచంలో మేటి ఇన్వెస్టర్లలో ఒకరైన వారెన్ బఫెట్ 93 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా జీవిస్తూ, చరుగ్గా పెట్టుబడుల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. మరి ఆయన ఆరోగ్య రహస్యం ఏంటా? అని చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే ఆరోగ్యం కోసం ఆయన నోరు కట్టేసుకునే రకం కాదు. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికే ఆయన ఇష్టపడతారు. 2015లో బఫెట్ స్వయంగా తన ఆహార అలవాట్ల గురించి ఫార్చ్యూన్ సంస్థతో పంచుకున్నారు.

రోజులో 5 క్యాన్ల కోక్ ను తాగుతానని బఫెట్ చెప్పారు. పగటి సమయంలో మూడు కోక్ లు, రాత్రి సమయంలో రెండు కోక్ లు ఆయన తాగుతారు. ఇక వారంలో మూడు రోజులు అయినా చికెన్ నగ్గెట్స్ తినాల్సిందే. ఐస్ క్రీమ్ ను కూడా ఇష్టంగా తింటారు. రోజులో తనకు కావాల్సిన మొత్తం కేలరీల్లో 25 శాతం కోక్ రూపంలో లభిస్తుంది.  సాల్టెడ్ ఆలు స్టిక్స్ కూడా తింటారు. 

‘‘నచ్చింది తినడానికి బదులు.. బ్రొక్కోలీ, మరికొన్ని ఇతర పదార్థాలు తీసుకోవడం వల్ల ఏడాది పాటు అదనంగా జీవిస్తానని ఎవరైనా బెబితే నా జీవితం నుంచి ఒక ఏడాది తీసుకోండని చెబుతాను. నేను ఏది కోరుకుంటానో అది తిననివ్వండి’’ అని బఫెట్ చెప్పడం గమనార్హం. ‘‘సంతోషం అన్నది ఎంతో మార్పును తెస్తుంది. ముఖ్యంగా ఆయుర్దాయం విషయంలో గణనీయమైన మార్పును చూపిస్తుంది. నేను ఫుడ్జ్ శాండర్స్ తిన్నప్పుడు కోక్ తాగినప్పుడు సంతోషంగా ఉంటాను’’ అని బఫెట్ చెప్పారు. సంతోషమే సగం బలం అన్నట్టు తనకు ఆనందాన్నిచ్చే ఫుడ్ తీసుకోవడం ద్వారా ఎక్కువ కాలం పాటు జీవించి ఉండొచ్చని బఫెట్ విధానాన్ని పరిశీలిస్తే తెలుస్తోంది.
Warren Buffett
health secret
food menu
happiness

More Telugu News