prashanth kishore: జమిలి ఎన్నికలకు ఓటేస్తున్న ప్రశాంత్ కిషోర్!

Prashant Kishor on One Nation One Election Warning

  • జమిలికి షరతులతో కూడిన మద్దతు ఇస్తామన్న ఎన్నికల వ్యూహకర్త
  • ఖర్చులు తగ్గుతాయని, ఓటర్లూ ఒకేసారి నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్య
  • దేశ ప్రయోజనాలకు సరైన ఉద్ధేశ్యంతో అయితే అంగీకరిస్తామని వెల్లడి

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ జమిలి ఎన్నికల కోసం కసరత్తు చేస్తోంది. దీనిపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షరతులతో కూడిన మద్దతును ఇస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం సరైన ఉద్దేశ్యంతో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే అంగీకరిస్తామన్నారు. ఒకే దేశం.. ఒకే ఎన్నిక వల్ల ఖర్చులు తగ్గిస్తాయని, ఓటర్లకు కూడా ఇబ్బందులు తగ్గవచ్చునన్నారు. భారత్ వంటి పెద్ద దేశాల్లో ఏడాదికి 25 శాతం మంది ఎన్నికల్లో ఓటు వేస్తుంటారని, జమిలి తీసుకువస్తే ఒకటి రెండుసార్లకే పరిమితమవుతుందని, ఇది ప్రయోజనకరమే అన్నారు.

అయితే, రాత్రికి రాత్రే 2024లోనే జమిలి తీసుకువస్తే ఇబ్బందులు వస్తాయన్నారు. సరైన ఉద్ధేశ్యం ఉంటే నాలుగు నుండి ఐదు సంవత్సరాల సమయం పడుతుందన్నారు. ఇది అసాధ్యమైతే గతంలో 17, 18 సంవత్సరాల పాటు ఎలా అమలు చేశారని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది పావు వంతు ప్రజలు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడం వల్ల ఎప్పుడూ ఎన్నికల వలయంలో చిక్కుకోవడం అవుతోందని, జమిలి ద్వారా ఇది ఒకటి రెండుసార్లకు పరిమితమైతే మంచిదే అన్నారు. జమిలి ద్వారా ప్రజలు ఒకేసారి నిర్ణయం తీసుకుంటారన్నారు. ప్రభుత్వం బిల్లును తీసుకు వస్తోందని, అది వచ్చాక చూడాలని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అమలు చేయాలన్నారు. ఇది దేశానికి మంచిదే అన్నారు.

prashanth kishore
BJP
one nation one election
indi
  • Loading...

More Telugu News