DJ Pilla: 'శశివదనే' నుంచి 'డీజే పిల్లా' లిరికల్ వీడియో విడుదల

DJ Pilla song lyrical video out now

  • రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా శశివదనే
  • సాయిమోహన్ ఉబ్బన దర్శకత్వంలో చిత్రం
  • విడుదలకు ముస్తాబవుతున్న లవ్ ఎంటర్టయినర్

"నా దిల్లే నీ వల్లే
టూరింగు టాకీసులా మారెనే
నా కల్లో నీ బొమ్మనే
షో మీద షో వేసి చూపించనే
డీజే పిల్లా ఎదలో ఇల్లా
విజిలే వేసి బీటే కొట్టగా .."


అంటూ ఓ కుర్రాడు తన ప్రేయసి తన మనసులోని ప్రేమను పాట రూపంలో చెప్పేస్తున్నాడు. ఇంతకీ అబ్బాయి, అమ్మాయి మధ్య ఎందు ప్రేమ పుట్టింది. వారి ప్రేమ మజిలీ ఏంటి? అనేది తెలుసుకోవాలంటే 'శశివదనే' సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. 

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ హీరో హీరోయిన్ గా నటించారు. శశివదనే చిత్రం నుంచి తాజాగా 'డీజే పిల్లా..' లిరికల్  సాంగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. శరవణ వాసుదేవన్ బాణీలు అందించగా, కిట్టు విస్సా ప్రగడ సాహిత్యాన్ని అందించాడు. ఈ గీతాన్ని యువ గాయకుడు వైశాగ్ ఆలపించాడు. 

గౌరి నాయుడు సమర్పణలో ఎ.జి.ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్ పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్నారు. గోదావ‌రి బ్యాక్‌డ్రాప్‌లో అంద‌మైన ప్రేమ‌క‌థ‌గా దీన్ని రూపొందిస్తున్నారు. 

చిత్ర నిర్మాతలు అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ "మా 'శశివదనే' సినిమా హార్ట్ టచింగ్ లవ్ కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కింది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం" అని వెల్లడించారు.

DJ Pilla
Lyrical Video
Sasivadane
Rakshit Atluri
Komali Prasad
Sai Mohan Ubbana
Saravana Vasudevan
Kittu Vissapragada
Vaisagh

More Telugu News