: సీఎం కిడ్నాప్ ముఠాల అధినేత: కోదండరామ్
ముఖ్యమంత్రి కిడ్నాప్ ముఠాలకు అధినేతగా వ్యవహరిస్తున్నారని కోదండరాం తీవ్రవ్యాఖ్యలు చేసారు. హైదరాబాదులో ఈ రోజు ఆయన మాట్లాడుతూ, ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఈ నెల 14న ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని టీజేఏసీ కన్వీనర్ కోదండరామ్ స్పష్టం చేసారు. అక్రమ బైండోవర్ కేసులు, బెదిరింపుకాల్స్ తో భయపెట్టినా వెనక్కుతగ్గేది లేదని ఆయన తెలిపారు. దీనివల్ల జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో పాలన లేదని, ప్రభుత్వం పతనమైపోయిందనీ ఆయన అన్నారు. ఛలో అసెంబ్లీపై గురువారం నుంచి విస్త్రత ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. చేప ప్రసాదం పంపిణీకి లోకాయుక్త ప్రభుత్వానికి సూచనలు చేసిన నేపధ్యంలో ఈ మందు పంపిణీకి ప్రభుత్వమే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేసారు.