rajaiah: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో ఎమ్మెల్యే రాజయ్య భేటీ

MLA Rajaiah meets with damodara rajanarsimha
  • హన్మకొండ ఎస్సీ సమావేశం సందర్భంగా భేటీ అయిన రాజయ్య, దామోదర
  • స్టేషన్ ఘనపూర్ నుండి ఎమ్మెల్యే టిక్కెట్ దక్కని రాజయ్య
  • సాధారణ సమావేశమేనని రాజయ్య వర్గీయుల స్పష్టీకరణ
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో భేటీ అయ్యారు. సోమవారం హన్మకొండ నయీంనగర్‌లో వీరిద్దరు ఎస్సీ సమావేశం సందర్భంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

గత నెలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 119 నియోజకవర్గాలకు గాను 115 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో స్టేషన్ ఘనపూర్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు చోటు దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. అయినప్పటికీ తాను కేసీఆర్ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని ప్రకటించారు. ఆ తర్వాత మార్పులు జరుగుతాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఇద్దరు మాజీ ఉపముఖ్యమంత్రుల భేటీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఇది సాధారణ సమావేశమేనని రాజయ్య వర్గీయులు చెబుతున్నారు.

rajaiah
damodara rajanarsimha
Congress
BJP

More Telugu News