palamuru: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఫొటోలతో మంత్రి కేటీఆర్ ట్వీట్

KTR tweet Palamuru Rangareddy lift project

  • కేసీఆర్ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ ప్రాజెక్టు నిదర్శనమన్న కేటీఆర్
  • సాగునీటి రంగంలో పాలమూరు-రంగారెడ్డి మరో కాళేశ్వరమని వ్యాఖ్య
  • అవాంతరాలు, కుట్రలను అధిగమిస్తూ ప్రాజెక్టు పూర్తవుతోందన్న మంత్రి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తవుతోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్వీట్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ ప్రాజెక్టు నిదర్శనమన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఫొటోలతో మంత్రి ట్వీట్ చేశారు. 

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆవిష్కృతమవుతోందని, ఇది సగర్వంగా ఎగురుతున్న తెలంగాణ జలవిజయ పతాకమని అభివర్ణించారు. నీటికోసం తండ్లాడిన నేలల్లో సుజల దృశ్యం సాక్షాత్కరిస్తోందని, ఇది తెలంగాణ సాగునీటి రంగంలో మరో కాళేశ్వరమని పేర్కొన్నారు. అవాంతరాలను, అడ్డంకులను అధిగమిస్తూ... కుట్రలను, కేసులను గెలుస్తూ... జలసంకల్పంతో అనుమతులు సాధించి, దశాబ్దాల కలను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టు పూర్తవుతోందని పేర్కొంది. బిరా బిరా కృష్ణమ్మ బీళ్లకు నీళ్లు అందించనుందన్నారు. ఇది తెలంగాణ జలశక్తి, కేసీఆర్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమంటూ ట్వీట్ ముగించారు.

palamuru
rangareddy
KTR
  • Loading...

More Telugu News