Andhra Pradesh: కోస్తాంధ్రకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన... ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ

Heavy to very heavy rain alert for Coastal Andhra Pradesh
  • ఉత్తర కోస్తాలో ఈ నెల 5, 6 తేదీల్లో రికార్డు స్థాయిలో వర్షం కురిసే అవకాశం
  • ఈ నెల 6న దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
  • ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
నెల రోజుల విరామం అనంతరం ఏపీలో మళ్లీ వర్షాల జోరు మొదలైంది. గత రెండ్రోజులుగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గణనీయమైన స్థాయిలో వర్షపాతం నమోదైంది. తాజాగా భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం కోస్తాంధ్రకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 

ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో ఈ నెల 5, 6 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ నెల 6న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. 

రాబోయే రెండ్రోజుల్లో 11.56 సెంమీ నుంచి 20.44 సెంమీ వరకు రికార్డు స్థాయి వర్షపాతం నమోదయ్యే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.
Andhra Pradesh
Very Heavy Rains
Coastal Andhra
Orange Alert
IMD

More Telugu News