Vijay Devarakonda: తమ్ముడి ‘బేబి’, నా ’ఖుషి‘ హిట్​ అయ్యాయి: విజయ్ దేవరకొండ

Vijay devarakonda visits yadadri after Khushi hit talk

  • ఈ ఏడాది తమ కుటుంబానికి కలిసొచ్చిందన్న స్టార్ హీరో
  • ఖుషి చిత్ర బృందం, కుటుంబంతో యాదాద్రి సందర్శన
  • తమలాగే అందరూ ఆనందంగా ఉండాలని కోరుకున్నానన్న విజయ్

అటు తమ్ముడు అనంద్ నటించిన 'బేబి' సినిమా.. ఇటు తన తాజా చిత్రం ఖుషి హిట్స్ తో విజయ్ దేవరకొండ ఆనందంలో ఉన్నాడు. చిత్ర బృందం, కుటుంబ సభ్యులతో కలసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నాడు. ఈ ఏడాది తమ కుటుంబానికి బాగా కలిసొచ్చిందని అన్నాడు. రెండు సినిమాలు హిట్ అయ్యాయని, అందుకే కృతజ్ఞతలు చెప్పుకోవడానికి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నట్టు తెలిపాడు. ఖుషి సినిమాను నిర్మించిన మైత్రి సంస్థకు కూడా ఈ ఏడాది బాగా కలిసొచ్చిందన్నాడు. 

ఆ సంస్థ నిర్మించిన రెండు చిత్రాలకు జాతీయ అవార్డులు రావడం, ఇప్పుడు ‘ఖుషి’ హిట్‌ అవడం సంతోషకరం అని చెప్పాడు. తమలాగే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని దేవుడిని కోరుకున్నానని విజయ్ తెలిపాడు. ఖుషి దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ కూడా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు.

More Telugu News