Chandrababu: చంద్రబాబు జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు

Chandrababu districts tour schedule finalized
  • బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం ప్రకటించిన చంద్రబాబు
  • ఈ నెల 5 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన 
  • రాయదుర్గం నుంచి పర్యటన ప్రారంభం
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 'బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ' కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5వ తేదీ నుంచి జిల్లాల పర్యటనకు వెళుతున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. 

ఈ నెల 5వ తేదీ అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి పర్యటన ప్రారంభం అవుతుంది. 5, 6, 7 తేదీల్లో అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్ నియోజకవర్గాల్లో వివిధ వర్గాల ప్రజలతో చర్చా కార్యక్రమాలు, సమావేశాలు, రోడ్ షోలు, సభల్లో పాల్గొంటారు. 8, 9 తేదీల్లో కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన ఉంటుంది. 

ముందుగా హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 1 గంటకు బళ్లారి చేరుకోనున్న చంద్రబాబు నాయుడు గారు... అక్కడ తెలుగు ప్రజలు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం రాయదుర్గం నియోజకవర్గం పర్యటనలో పాల్గొంటారు. 

'బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ' కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 45 రోజుల పాటు పార్టీ కార్యకర్తలు, నేతలు ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మొదలైన ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలు, నేతలు పాల్గొంటున్నారు.
Chandrababu
Districts Tour
TDP
Andhra Pradesh

More Telugu News