Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, నారా లోకేశ్

Chandrababu and Nara Lokesh greetings to Pawan Kalyan

  • నేడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు
  • ప్రజల మనిషి, జనహితాన్ని కోరుకునే వ్యక్తి అంటూ చంద్రబాబు ప్రశంస
  • రియల్ హీరో పవన్ అంటూ నారా లోకేశ్ ట్వీట్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్ కూడా గ్రీటింగ్స్ తెలిపారు. 

'సినీ నటులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల మనిషిగా, సమాజ శ్రేయోభిలాషిగా రాష్ట్ర జనహితాన్ని కోరుకునే మీరు, నిండు నూరేళ్లు ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను' అంటూ ట్విట్టర్ వేదికగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. 

'జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సమాజం పట్ల బాధ్యతతో ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్న రియల్ హీరో పవన్ కల్యాణ్ గారు ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News