Upasana: క్లీంకారతో కలిసి వరలక్ష్మి వ్రతం చేసిన ఉపాసన

Upasana done Varalakshmi Vratham with Klin Kaara

  • ఇటీవల తల్లయిన ఉపాసన
  • కుమార్తెకు క్లీంకార అని పేరుపెట్టిన రామ్ చరణ్, ఉపాసన
  • ఇవాళ శ్రావణ శుక్రవారం సందర్భంగా వ్రతం చేసిన ఉపాసన 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఉపాసన జూన్ 20న పండంటి పాపకు జన్మనిచ్చారు. పాపకు క్లీంకార కొణిదెల అని నామకరణం చేశారు. పెళ్లయిన పదకొండేళ్ల తర్వాత పుట్టిన తొలి సంతానం కావడంతో రామ్ చరణ్, ఉపాసన ఆనందానికి అవధుల్లేవు.

ప్రస్తుతం శ్రావణ మాసం. ఇవాళ శ్రావణ శుక్రవారం సందర్భంగా తన నివాసంలో తొలిసారిగా వరలక్ష్మి వ్రతం నిర్వహించినట్టు ఉపాసన వెల్లడించారు. ఈ వ్రతంలో తనతో పాటు కుమార్తె క్లీంకార కూడా పాల్గొన్నట్టు తెలిపారు. ఇంతకంటే ఇంకేమీ కోరుకోను అంటూ ఆ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు. 

వ్రతానికి సంబంధించిన ఫొటోను కూడా ఉపాసన పంచుకున్నారు. తన ఒళ్లో క్లీంకారను కూర్చోబెట్టుకుని ఫొటో తీయించుకున్నారు. అయితే ఫొటోలో క్లీంకార ముఖం కనిపించకుండా, ఎమోజీతో కవర్ చేశారు.

More Telugu News