Vijay Devarakonda: కన్నీళ్లు ఆగడం లేదు: విజయ్ దేవరకొండ

Vijay Devarakonda emotional tweet

  • ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 'ఖుషి' మూవీ
  • తొలి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా
  • ఈరోజు కోసం ఐదేళ్లు ఎదురు చూశారన్న విజయ్

విజయ్ దేవరకొండ, సమంత అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'ఖుషి' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఈ చిత్రం హిట్ టాక్ ను తెచ్చుకుంది. సినిమా ఘన విజయం సాధించడంతో విజయ్ భావోద్వేగానికి గురయ్యారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ... ఈరోజు కోసం తనతో పాటు మీరంతా ఐదేళ్లు ఎదురు చూశారని చెప్పారు. తన కోసం ఎంతో సహనంతో వేచి చూశారని అన్నాడు. ఈరోజు మనం సాధించామని చెప్పాడు. వందల ఫోన్లు, మెసేజులతో నిద్ర లేచానని... భావోద్వేగంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయానని అన్నాడు. మీ స్నేహితులు, కుటుంబంతో కలసి వెళ్లి సినిమాను ఎంజాయ్ చేయాలని చెప్పాడు.

Vijay Devarakonda
Khushi Movie
Samantha
  • Loading...

More Telugu News