Aparna Nair: మలయాళ టీవీ, సినీనటి అపర్ణ ఆత్మహత్య.. షాక్‌లో ఇండస్ట్రీ

Malayalam TV actress Aparna Nair found dead

  • నిన్న సాయంత్రం 7.30 గంటల సమయంలో ఉరి వేసుకున్న నటి
  • పోలీసులకు సమాచారం అందించిన ప్రైవేటు ఆసుపత్రి వర్గాలు
  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

మలయాళ టీవీ, సినీనటి అపర్ణ నాయర్ నిన్న రాత్రి పొద్దుపోయాక తిరువనంతపురంలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. 33 ఏళ్ల అపర్ణ పలు సీరియళ్లతోపాటు కొన్ని సినిమాల్లోనూ నటించారు. ఆమెకు భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నిన్న సాయంత్రం 7.30 గంటల సమయంలో సీలింగుకి వేలాడుతున్న అపర్ణను చూసిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

కుటుంబ సమస్యలే ఆమె మృతికి కారణం అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. కాగా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అపర్ణ ఆత్మహత్యకు 11 గంటల ముందే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు. పలు సూపర్ హిట్ సీరియళ్లలో నటించి పేరు తెచ్చుకున్న అపర్ణ నాలుగైదు సినిమాల్లోనూ నటించారు. ఆమె ఆత్మహత్య విషయం తెలిసి ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ కూడా సరిగ్గా నెల రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు.

More Telugu News