Samantha: డల్లాస్ లో 'ఖుషి' ప్రీరిలీజ్ ఈవెంట్ లో సమంత సందడి.. వీడియో ఇదిగో!

Samantha in Khushi pre release event in Dallas

  • ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన 'ఖుషి'
  • తొలి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ
  • యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా టాప్ 10లో ఉండాలన్న సమంత

అందాల ముద్దుగుమ్మ సమంత, హీరో విజయ్ దేవరకొండ జంటగా నటించిన 'ఖుషి' సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. భారత కాలమానం ప్రకారం అమెరికాలో రాత్రి 12.30 గంటలకు ప్రీమియర్ షోలు పడిపోయాయి. తొలి షో నుంచే ఈ సినిమా హిట్ టాక్ ను తెచ్చుకుంది. మరోవైపు సమంత గత కొన్ని రోజులుగా అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలో డల్లాస్ లో నిర్వహించిన 'ఖుషి' ప్రీరిలీజ్ ఈవెంట్ లో సమంత సందడి చేసింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ, స్వదేశాన్ని విడిచి ఇక్కడకు వచ్చినా మన సంస్కృతి, సంప్రదాయాలని కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద టాప్ టెన్ లో ఉండాలని ఆమె ఆకాంక్షించారు.

More Telugu News