Junior NTR: జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల 'వార్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్

Junior NTR and Hrithik Roshan War 2 Movie release date

  • తొలి సారి డైరెక్ట్ బాలీవుడ్ మూవీ చేస్తున్న తారక్
  • 'వార్'కు సీక్వెల్ గా 'వార్ 2'ను నిర్మిస్తున్న యశ్ రాజ్ ఫిలింస్
  • 2025 జనవరి 24న విడుదల కానున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం

దేశ సినీ రంగంలో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లకు ఉన్న స్థాయి, స్థానం ఎలాంటివో అందరికీ తెలిసిందే. వీరి సినిమాలు రిలీజ్ అయితే థియేటర్లు కిక్కిరిసిపోతాయి. అలాంటిది ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తే... ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. వీరి దెబ్బకు బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే. వీరిద్దరూ కలిసి 'వార్ 2' చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్ట్ బాలీవుడ్ చిత్రంలో తారక్ నటిస్తుండటం ఇదే తొలిసారి. 

బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ 'వార్' చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'బ్రహ్మాస్త్ర' డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు, ఈ చిత్రానికి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రం 2025 జనవరి 24న విడుదలవుతోంది. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ద్వారా నజీర్ అనే పాత్రలో ఎన్టీఆర్, కబీర్ అనే పాత్రలో హృతిక్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. 

Junior NTR
Hrithik Roshan
WAR 2 Movie
Tollywood
Bollywood
Release Date

More Telugu News