Tamannaah: పెళ్లిపై మనసులో మాట బయటపెట్టిన తమన్నా

Tamannaah opines on marriage and career

  • కెరీర్ లో ఉన్నత దశ నడుస్తోందన్న తమన్నా
  • ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టీకరణ
  • వివాహ వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉందని వెల్లడి 

మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పట్లో పెళ్లి చేసుకునేది లేదని వెల్లడించింది. కెరీర్ లో ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నానని, అవకాశాలు బాగా వస్తున్నాయని, ఇలాంటి దశలో పెళ్లి చేసుకోలేనని వివరించింది. వివాహ వ్యవస్థపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని స్పష్టం చేసింది. 

గడచిన 5 నెలల్లో తాను నటించిన సినిమాలు, వెబ్ సిరీస్ లు అన్నీ కలిపి 6 విడుదలయ్యాయని తమన్నా పేర్కొంది. నటిగా ఉత్తమ దశలో ఉన్నానని, వైవిధ్యంతో కూడిన పాత్రలు లభిస్తున్నాయని వెల్లడించింది. తనపై విశేష రీతిలో ప్రేమ చూపుతున్న అభిమానుల కోసం ఎంత కష్టమైనా పడతానని తెలిపింది. తమన్నా ఇటీవలే చిరంజీవితో భోళాశంకర్ చిత్రం చేయడం తెలిసిందే. రజనీకాంత్ జైలర్ చిత్రంలోనూ ఓ పాత్ర చేసింది. 

కాగా, మిల్కీ బ్యూటీ కొంతకాలంగా నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అటు, తమన్నా గానీ, ఇటు విజయ్ వర్మ కానీ ఈ కథనాలను కొట్టిపారేయకపోవడంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని సినీ, మీడియా వర్గాలు దాదాపు నిర్ధారించేశాయి.

Tamannaah
Marriage
Career
Actress
  • Loading...

More Telugu News