Chiranjeevi: చిరంజీవికి రాఖీ కట్టిన తోబుట్టువులు... ఫొటోలు ఇవిగో!

Megastar Chiranjeevi sisters ties Rakhi to their brother

  • దేశవ్యాప్తంగా ఘనంగా రక్షాబంధన్
  • చిరంజీవి నివాసానికి వచ్చిన చెల్లెళ్లు
  • రాఖీలు కట్టిన విజయదుర్గ, మాధవి

దేశవ్యాప్తంగా రక్షా బంధన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. మహిళలు తమ అన్నలు, తమ్ముళ్లకు రాఖీలు కట్టి ఆశీస్సులు అందుకుంటున్నారు. తాజాగా, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కూడా ఆయన తోబుట్టువులు రాఖీ కట్టారు. విజయదుర్గ, మాధవి తమ అన్నయ్యకు రాఖీ కట్టి ఆయన నుంచి కానుకలు అందుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి చెల్లెళ్లకు ఆశీస్సులు అందించారు. చెల్లెళ్ల రాకతో చిరంజీవి నివాసంలో కోలాహలం  నెలకొంది. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో పంచుకున్నారు. హ్యాపీ రక్షాబంధన్... అందరికీ రాఖీ శుభాకాంక్షలు అంటూ స్పందించారు.

Chiranjeevi
Rakhi
Vijayadurga
Madhavi
Rakshabandhan
Tollywood
  • Loading...

More Telugu News