Samantha: పారితోషికం బ్యాలెన్స్ ను సమంత వదులుకోవడానికి కారణం అదేనట!

Samantha Special

  • కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న సమంత
  • ఆమె కారణంగా షూటింగు విషయంలో జరుగుతున్న జాప్యం 
  • తనకి రావలసిన ఎమౌంటును వదిలేస్తున్న సమంత
  • రేపు విడుదలవుతున్న 'ఖుషి' సినిమా

పారితోషికం విషయంలో హీరోలు .. హీరోయిన్స్ చాలా మంది నిర్మొహమాటంగా ఉంటారు. డబ్బింగ్ దశకి వచ్చేసరికి బ్యాలన్స్ ఎమౌంట్ అనేది లేకుండా చూసుకుంటారు. అది సర్దుబాటు చేస్తేనే డబ్బింగ్ ను పూర్తి చేస్తామని అనేవారే ఎక్కువ. అలాంటిది తమకి రావలసిన బ్యాలన్స్ ఎమౌంటును వదులుకునేవారు చాలా తక్కువమంది కనిపిస్తారు. 

అలాంటి వారి జాబితాలో సమంత కూడా కనిపిస్తోంది. సమంత 'శాకుంతలం' సినిమా చేస్తుండగానే అనారోగ్యానికి గురైంది. దాంతో ఆమె కారణంగా అనుకున్న సమయానికి షెడ్యూల్స్ పూర్తికాలేదు. అందువలన ప్రాజెక్టు విషయంలో ఆలస్యం జరుగుతూ వచ్చింది. సినిమా విడుదల తరువాత, నిర్మాతలకు లాస్ కూడా వచ్చింది. 

ఆ సమయంలో తనకి రావలసిన మిగతా ఎమౌంటును సమంత వదులుకుందనే టాక్ బలంగా వినిపించింది. ఇప్పుడు 'ఖుషి' విషయంలోను అదే మాట వినిపిస్తోంది. సమంత కారణంగానే 'ఖుషి' షూటింగు విషయంలో జాప్యం జరిగింది. అందువలన తనకి రావలసిన కోటి రూపాయలను సమంత వదులుకుందనే టాక్ వినిపిస్తోంది. రేపు విడుదలవుతున్న ఈ సినిమా, ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందనేది  చూడాలి. 

Samantha
Vijay Devarakonda
Khushi
Shiva Nirvana
  • Loading...

More Telugu News