Vijay Devarakonda: నా ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటా .. అమ్మాయి అలా ఉండాల్సిందే: విజయ్ దేవరకొండ

Vijay Devarakonda Interview

  • విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'ఖుషి'
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న హీరో 
  • చాలా కాలం తరువాత పెళ్లి గురించి ప్రస్తావన
  • సింపుల్ గానే తన పెళ్లి జరుగుతుందని వెల్లడి 

విజయ్ దేవరకొండ కొంతకాలంగా వరుస పరాజయాలతో ఉన్నాడు. లవ్ .. రొమాన్స్ .. మాస్ యాక్షన్ వైపు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన 'ఖుషి' సినిమా చేశాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, రేపు థియేటర్లకు రానుంది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నాడు. రీసెంటుగా ఆయన పోస్ట్ చేసిన ఒక ఫొటో వలన, ఆయన పెళ్లికి సంబంధించిన ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ, " నా ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను .. అదీ నాకు నచ్చిన అమ్మాయి దొరికితేనే" అని చెప్పాడు.

"పెళ్లి విషయంలో నేను ఎవరి కారణంగా ఒత్తిళ్లకు గురికాను. నా లైఫ్ పార్ట్నర్ గా వచ్చే అమ్మాయి, నా అలవాట్లను .. అభిరుచులను అర్థం చేసుకునేదై ఉండాలి. చాలా చిన్న చిన్న విషయాలుగా అనిపించేవి చూసినప్పుడు కూడా, తనే నాకు గుర్తుకు రావాలి. నా ఇష్టాలను .. తన ఇష్టాలుగా భావించి ఆనందించేదై ఉండాలి. ఇక ఎప్పుడు పెళ్లి చేసుకున్నా .. సింపుల్ గానే చేసుకుంటా. హంగులూ .. ఆర్భాటాలు ఉండవు" అని చెప్పుకొచ్చాడు. 

Vijay Devarakonda
Samantha
Shiva Nirvana
Khushi
  • Loading...

More Telugu News