Chandrababu: నారా లోకేశ్ కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
- 200వ రోజుకు చేరుకున్న లోకేశ్ యువగళం పాదయాత్ర
- ఇప్పటి వరకు 77 నియోజకవర్గాల్లో కొనసాగిన యాత్ర
- యువగళం.. ప్రజాగళంగా మారిందన్న చంద్రబాబు
టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 200వ రోజుకు చేరుకుంది. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 77 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగింది. లోకేశ్ ఇప్పటి వరకు 2,710 కిలోమీటర్లు నడిచారు. 64 బహిరంగ సభలు, 132 ముఖాముఖి సమావేశాల్లో లోకేశ్ పాల్గొన్నారు.
పాదయాత్ర 200వ రోజుకు చేరుకున్న సందర్భంగా లోకేశ్ కు టీడీపీ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలియజేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన కుమారుడికి శుభాకాంక్షలు తెలిపారు. యువగళంగా ప్రారంభమైన పాదయాత్ర... ప్రజాగళంగా మారిందని ఆయన అన్నారు. లోకేశ్ అతని టీమ్ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు.
200వ రోజు (31-8-2023) యువగళం వివరాలు:
పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా)
ఉదయం:
8.00 – జంగారెడ్డిగూడెం శివారు దండమూడి కళ్యాణమండపం నుంచి పాదయాత్ర ప్రారంభం
8.05 – పాదయాత్ర పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం
8.35 – నరసన్నపాలెంలో రైతులతో సమావేశం
9.05 – సీతంపేటలో స్థానికులతో మాటామంతీ
9.20 – పాదయాత్ర 2,700 కి.మీ.లకు చేరిక, సీతంపేటలో శిలాఫలకం ఆవిష్కరణ
11.20 – బయ్యనగూడెంలో స్థానికులతో సమావేశం
12.20 – కొయ్యలగూడెంలో భోజన విరామం
సాయంత్రం:4.00 – కొయ్యలగూడెంలో గిరిజనులతో ప్రత్యేక కార్యక్రమం
5.00 – కొయ్యలగూడెం నుంచి పాదయాత్ర కొనసాగింపు
5.45 – కొయ్యలగూడెం సెంటర్ లో స్థానికులతో సమావేశం
రాత్రి: 6.45 – గవరవరంలో స్థానికులతో సమావేశం
7.45 – పొంగుటూరులో స్థానికులతో సమావేశం
8.45 – పొంగుటూరు శివారు విడిది కేంద్రంలో బస