Nagma: 48 ఏళ్ల వయసులో పెళ్లి గురించి నగ్మా ఆసక్తికర వ్యాఖ్యలు!

Nagma comments on her marriage

  • పెళ్లి చేసుకోకూడదనే ఆలోచన తనకు ఎప్పుడూ లేదన్న నగ్మా
  • ఒక తోడు, పిల్లలు ఉండాలనే ఆశ తనకు కూడా ఉందని వ్యాఖ్య
  • పెళ్లి అయితే సంతోషిస్తానన్న నగ్మా

ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను తన అందచందాలతో ఉర్రూతలూగించిన నటి నగ్మా. దక్షిణాదిన ఆమె చాలా కాలం పాటు అగ్ర నటిగా కొనసాగింది. టాలీవుడ్ కు ఆమె దూరమై దాదాపు 20 ఏళ్లు అవుతోంది. ఆ తర్వాత ఇతర భాషల్లో కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ 2008లో నటనకు పూర్తిగా దూరమయింది. అనంతరం రాజకీయ రంగంలోకి ప్రవేశించింది. 

48 ఏళ్ల వయసు వచ్చినా నగ్మా ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు. టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీతో ఆమె ప్రేమాయణం అప్పట్లో సంచలనం రేపింది. పెళ్లి అయిన సినీ నటులు శరత్ కుమార్, మనోజ్ తివారీ, రవి కిషన్ లతో కూడా ఆమెకు అఫైర్ ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. 

తాజాగా తన పెళ్లి గురించి నగ్మా స్పందించింది. పెళ్లి చేసుకోకూడదనే ఆలోచన తనకు ఎప్పుడూ లేదని ఆమె తెలిపింది. తనకంటూ ఒక తోడు ఉండాలని, పిల్లలు ఉండాలనే ఆశ తనకు కూడా ఉందని చెప్పింది. పెళ్లి ద్వారా ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలనే ఆలోచన తనకు ఉందని... కాలం కలిసొస్తే తన పెళ్లి జరుగుతుందేమో చూద్దామని తెలిపింది. పెళ్లి అయితే మాత్రం తాను చాలా సంతోషిస్తానని చెప్పింది.

Nagma
Tollywood
Bollywood
Marriage
  • Loading...

More Telugu News