NTR: ఎన్టీఆర్ పేరు మీద చెల్లని నాణేన్ని విడుదల చేశారు: ఏపీ మంత్రి కారుమూరి

AP Minister Karumuri responds on NTR Coin

  • ఎన్టీఆర్ ముఖచిత్రంతో రూ.100 నాణేలు
  • ఆ నాణేలు ప్రజల్లో చలామణీ అయ్యేలా ఉండాలన్న మంత్రి
  • ఎన్టీఆర్ మంచి నేత అని వెల్లడి
  • నిన్న ఎన్టీఆర్ వెన్నుపోటుదారులందరూ ఒక్కచోట చేరారని వ్యాఖ్యలు

తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు, నాయకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గౌరవార్థం ఆయన ముఖచిత్రంతో కేంద్ర ప్రభుత్వం రూ.100 నాణేలను విడుదల చేయడం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. 

ఎన్టీఆర్ పేరు మీద చెల్లని నాణేన్ని విడుదల చేశారని విమర్శించారు. దివంగత నందమూరి తాకర రామారావు మంచి నేత అని, ఆయన పేరు మీద ముద్రించిన నాణేలు ప్రజల్లో చలామణీ అయ్యేలా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 

నిన్న నాణెం ఆవిష్కరణ కార్యక్రమం చూస్తుంటే, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన వాళ్లందరూ ఒక్కచోట చేరినట్టు అనిపించిందని విమర్శించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని పిలవకపోవడం ఏంటని మంత్రి కారుమూరి ప్రశ్నించారు.

NTR
Rs.100 Coin
Karumuri Nageswararao
YSRCP
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News