Vijay Devarakonda: 'ఖుషి' విషయంలో అదంతా అబద్ధమే: డైరెక్టర్ శివ నిర్వాణ

Shiva Nirvana Interview

  • పరిణతి సాధించిన ప్రేమకథగా 'ఖుషి'
  • సెప్టెంబర్ 1వ తేదీన భారీస్థాయిలో రిలీజ్
  • తన పారితోషికం గురించిన ప్రస్తావన 
  • విజయ్ కామెడీ టైమింగ్ హైలైట్ అంటూ వ్యాఖ్య

విజయ్ దేవరకొండ - సమంత జంటగా మైత్రీ బ్యానర్లో శివ నిర్వాణ 'ఖుషి' సినిమా చేశాడు. పరిణతి సాధించిన జంట మధ్య చిగురించిన ప్రేమకథ ఇది. హేషమ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో టీమ్ బిజీగా ఉంది. తాజా ఇంటర్వ్యూలో శివ నిర్వాణ మాట్లాడాడు. 

"తెలుగులో ఇంతవరకూ అనేక ప్రేమకథా చిత్రాలు వచ్చి ఉంటాయి. నాది కూడా ప్రేమకథనే అయినప్పుడు, మిగతా వాటికి భిన్నంగా ఒక కొత్త పాయింటు ఉండాలి. అలాంటి ఒక కొత్త పాయింటు ఉన్న సినిమానే 'ఖుషి'. ట్రైలర్ చూసిన వాళ్లు కొన్ని సినిమాలతో దీనిని పోల్చుతున్నారు. కానీ నిజానికి ట్రైలర్ లో నేను అసలు కంటెంట్ ఏమిటనేది చెప్పలేదు" అని అన్నాడు. 

" సినిమా అవుట్ పుట్ విషయంలో విజయ్ దేవరకొండ - సమంత ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా కోసం నేను, విజయ్ - సమంతలతో సమానంగా పారితోషికం అందుకున్నాననే ప్రచారం జరుగుతోంది. అందులో ఎంతమాత్రం నిజం లేదు .. అదంతా కేవలం పుకారు మాత్రమే. ఈ సినిమాలో వింటేజ్ సమంతను చూస్తారు .. విజయ్ దేవరకొండ కామెడీ టైమింగ్ ఎలాంటిదో తెలుసుకుంటారు" అంటూ చెప్పుకొచ్చాడు. 

Vijay Devarakonda
Samantha
Shiva Nirvana
Khushi
  • Loading...

More Telugu News