Kajol: రూ.8 కోట్లతో ప్రాపర్టీ కొనుగోలు చేసిన కాజోల్

Kajol buys an office space worth Rs 8 crore in Mumbai

  • ముంబైలోని ఓషివారా ప్రాంతంలో కొనుగోలు
  • 194 చదరపు అడుగులకు భారీ ధర
  • ఈ ఏడాది ఏప్రిల్ లోనూ రూ.16 కోట్లతో ఆఫీస్ స్థలం కొనుగోలు

బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ ముంబైలో మరో ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఆరంభంలోనూ కాజోల్ ముంబైలో ఓ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేయడం గమనార్హం. తాజాగా ఆమె కార్యాలయ వినియోగానికి ఉద్దేశించిన ప్రాపర్టీని రూ.7.64 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. ఓషివారా ప్రాంతంలోని సిగ్నేచర్ బిల్డింగ్ లో 194.67 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని జులై 28న కొనుగోలు చేసిన విషయం తాజాగా వెలుగు చూసింది. 

ఈ ఏడాది ఏప్రిల్ లో 2,493 చదరపు అడుగుల అపార్ట్ మెంట్ ను కాజోల్ రూ.16.50 కోట్లతో కొనుగోలు చేయడం తెలిసిందే. కాజోల్ భర్త అజయ్ దేవ్ గణ్ సైతం ఇటీవలే రూ.45 కోట్లతో ఐదు కార్యాలయ భవనాలను సొంతం చేసుకున్నారు. ఈ దంపతులు తమ ఆదాయంతో ఖరీదైన ఆస్తులు సమకూర్చుకుంటున్నట్టు వారి కొనుగోళ్లను పరిశీలిస్తే తెలుస్తుంది. కాజోల్ నెట్ ఫ్లిక్స్ ఆంథాలజీ, లస్ట్ స్టోరీస్ 2, ద ట్రయల్ లో కనిపిస్తుండడం తెలిసిందే.

More Telugu News