Sai Chand: సాయిచంద్ భార్యకు కోటి రూపాయల ఆర్థిక సాయం అందించిన బీఆర్ఎస్ పార్టీ

BRS party gives 1 Cr to Sai Chand wife Rajani
  • ఇటీవల ఆకస్మిక మృతి చెందిన గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్
  • భార్యకు కోటి.. తల్లిదండ్రులు, సోదరికి రూ. 50 లక్షలు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ
  • తెలంగాణ ప్రజల గుండె చప్పుడు సాయిచంద్ అన్న సబితా ఇంద్రారెడ్డి
గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్న సాయిచంద్ చిన్న వయసులోనే ఆకస్మిక మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన భార్య రజనీకి బీఆర్ఎస్ పార్టీ కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని అందించింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జడ్పీ ఛైర్ పర్సన్ అనితా రెడ్డి, దాసోజు శ్రవణ్ లు సాయిచంద్ ఇంటికి వెళ్లి రజనీకి కోటి రూపాయల చెక్ ను అందించారు. 

ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలతో సాయిచంద్ తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా నిలిచారని కొనియాడారు. ఆయన మరణం తీరని లోటు అని చెప్పారు. భర్తను కోల్పోయిన రజనీ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని అన్నారు. సాయిచంద్ కుటుంబానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. రజనీకి కోటి రూపాయలు, సాయిచంద్ తల్లిదండ్రులు, సోదరికి మరో రూ. 50 లక్షలు అందించామని తెలిపారు. మరోవైపు, సాయిచంద్ మరణంతో ఆయన భార్య రజనీని గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ గా కేసీఆర్ నియమించారు.
Sai Chand
BRS
KCR

More Telugu News