Nara Rohith: టీవీ5 మూర్తి దర్శకత్వంలో 'ప్రతినిధి-2'గా నారా రోహిత్

Nara Rohith back to cinemas

  • 2018 నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న నారా రోహిత్
  • చివరిసారిగా వీరభోగవసంతరాయలు చిత్రంలో నటించిన వైనం
  • ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్న నారా రోహిత్

టీడీపీ అధినేత చంద్రబాబు సోదరుడి కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన నారా రోహిత్ 2018 తర్వాత వెండితెరపై కనిపించలేదు. ఇన్నాళ్ల తర్వాత నారా రోహిత్ మళ్లీ కెమెరా ముందుకొస్తున్నాడు. నారా రోహిత్ ప్రధాన పాత్రలో ప్రతినిధి-2 చిత్రం షూటింగ్ జోరుగా సాగుతోంది. 

బాణం, సోలో, ప్రతినిధి వంటి చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్... చివరిగా వీరభోగ వసంతరాయలు చిత్రంలో నటించాడు. ఈ సినిమా 2018లో వచ్చింది. ఆ తర్వాత ఐదేళ్ల విరామం తీసుకున్న రోహిత్ ఇప్పుడు ప్రతినిధి-2 చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నాడు. 2014లో వచ్చిన ప్రతినిధి చిత్రానికి ఇది సీక్వెల్. ఇది కూడా పొలిటికల్ థ్రిల్లర్ కథాంశమేనని తెలుస్తోంది. 

ప్రతినిధి-2 చిత్రానికి సీనియర్ జర్నలిస్ట్, టీవీ5 చానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. మూర్తికి దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. వానర ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

Nara Rohith
Prathinidhi-2
Murthy
Tollywood
  • Loading...

More Telugu News