Chandrababu: ఢిల్లీలో ఆసక్తికర పరిణామం.. జేపీ నడ్డాతో చంద్రబాబు మాటమంతీ!

chandrababu meets jp nadda

  • ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమంలో పాల్గొన్న నడ్డా, చంద్రబాబు
  • ఏదో అంశంపై మాట్లాడుతూ కనిపించిన ఇద్దరు నేతలు
  • తర్వాత నడ్డా, పురందేశ్వరి, చంద్రబాబు, సీఎం రమేశ్ తదితరుల భేటీ

దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్రంతో ఉన్న రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్ లోని సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు మాట మంతీ సాగింది. పక్కపక్కన కూర్చున్న ఇద్దరు నేతలూ ఏదో అంశంపై సీరియస్‌గా చర్చిస్తూ కనిపించారు. వారి పక్కనే నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణరాజు కూర్చున్నారు.

మరోవైపు జేపీ నడ్డాతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రఘురామకృష్ణరాజు, సీఎం రమేశ్ తదితర నేతలు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీ, దేశ రాజకీయాలపై ఇద్దరు నేతలు చర్చించారని, ఏపీలో ఓట్ల తొలగింపు అంశాన్ని నడ్డా దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారని చర్చ జరుగుతోంది. 

Chandrababu
JP Nadda
Telugudesam
BJP
NTR
Delhi
Raghu Rama Krishna Raju
  • Loading...

More Telugu News