Manipur Violence: మళ్లీ రగిలిన మణిపూర్.. ఇళ్లకు నిప్పు

Three houses burnt in Manipurs Imphal

  • రాజధాని ఇంఫాల్‌లోని న్యూలంబూలేన్ ప్రాంతంలో ఘటన
  • తాము అక్కడ ఉండేందుకు వీలుగా కేంద్ర రాష్ట్ర బలగాలను మోహరించాలని స్థానికుల డిమాండ్
  • బాష్పవాయువు ప్రయోగించి చెదరగొట్టిన పోలీసులు
  • మరో ఘటనలో ఆయుధాలు ఎత్తుకెళ్లిన దుండగులు

చెదురుమదురు ఘటనలు మినహా ఇప్పుడిప్పుడే మామూలు స్థితికి చేరుకుంటున్న మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. రాజధాని ఇంఫాల్‌లోని న్యూ లంబూలేన్ ప్రాంతంలో నిన్న గుర్తు తెలియని వ్యక్తులు కొందరు మూడు ఇళ్లకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. 

మరోవైపు, ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు తాము అక్కడ ఉండేందుకు వీలుగా కేంద్ర రాష్ట్ర బలగాలను మోహరించాలని నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. మరో ఘటనలో ఆరోగ్యశాఖ మాజీ డైరెక్టర్ ఇంటివద్ద భద్రతా విధుల్లో ఉన్న సిబ్బంది నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రెండు ఏకే రైఫిళ్లు, కార్బైన్ ఎత్తుకెళ్లారు.

Manipur Violence
Imphal
Tear Gas
  • Loading...

More Telugu News