RC16: రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో ఆర్సీ16... జోరుగా ప్రీ ప్రొడక్షన్ పనులు

RC16 office started in Hyderabad

  • బుచ్చిబాబు కథకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్
  • త్వరలో షూటింగ్ ప్రారంభం
  • తాజాగా ఆర్సీ16 కోసం ఆఫీసు ప్రారంభించిన చిత్రబృందం
  • కొబ్బరికాయ కొట్టిన సుకుమార్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రారంభం కానున్న కొత్త చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే, బుచ్చిబాబు సానాతో చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. రామ్ చరణ్ కు ఇది 16వ చిత్రం. 

తాజాగా, ఆర్సీ16 కోసం హైదరాబాదులో చిత్రబృందం నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. నేడు దీనికి సంబంధించిన పూజా కార్యాక్రమాలను నిర్వహించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నాయి.

RC16
Ram Charan
Buchibabu Sana
Office
Hyderabad
Tollywood
  • Loading...

More Telugu News