Vijayasai Reddy: 'పుష్ప'కు జాతీయ అవార్డు... చంద్రబాబుపై సెటైర్ వేసిన విజయసాయి

Vijayasai satires on Chandrababu

  • పుష్ప చిత్రంలో నటనకు అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు
  • బాబు గారి బిల్డప్ అంటూ విజయసాయి వ్యంగ్యం
  • తనదైన శైలిలో ట్వీట్ చేసిన వైసీపీ ఎంపీ

పుష్ప చిత్రానికి గాను అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబుపై తరచుగా విమర్శనాస్త్రాలు సంధించే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జాతీయ అవార్డు అంశాన్ని ఉపయోగించుకుని సెటైర్ వేశారు. 

"పుష్ప సినిమాకు జాతీయ అవార్డు ప్రకటించగానే, అందులో తానున్నానంటూ బాబుగారు బిల్డప్ ఇస్తున్నారు" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

"పుష్ప చిత్రంలోని ఓ సీన్లో పోలీస్ స్టేషన్ గోడకు వేళ్లాడుతూ నా ఫొటో ఉంది... అందుకే అవార్డు వచ్చింది అని చంద్రబాబు అంటున్నారు. అవును, ఆయన హయాంలో ఎర్రచందనం విచ్చలవిడిగా అక్రమ రవాణా జరిగిందని, అందుకే పోలీస్ స్టేషన్ లో ఆయన ఫొటో పెట్టారని జనం అంటున్నారు" అంటూ విజయసాయి ఎద్దేవా చేశారు.

Vijayasai Reddy
Chandrababu
Pushpa
National Award
Allu Arjun
YSRCP
TDP
  • Loading...

More Telugu News