USA: వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిత్వానికీ సిద్ధమేనన్న వివేక్ రామస్వామి

US Presidential Elections 2024

  • ట్రంప్ తో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు సంసిద్ధత
  • ప్రెసిడెంట్ రేసులో ఉంటానని గతంలో ప్రకటన
  • తాజాగా మాట మార్చిన రిపబ్లికన్ లీడర్

అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న భారత సంతతి నేత వివేక్ రామస్వామి తాజాగా మాటమార్చారు. ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడమే తన లక్ష్యమని, మరే ఇతర పదవిపైనా ఆసక్తి లేదని గతంలో ఆయన ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో నిలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన పార్టీ డిబేట్ లో మిగతా అభ్యర్థులకన్నా ముందు నిలిచారు. రికార్డు స్థాయిలో నిధులు సమీకరించారు. అయితే, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ ఎంపికైతే తాను ఉపాధ్యక్ష పదవికి పోటీ పడేందుకు సిద్ధమని వివేక్ రామస్వామి ప్రకటించారు.

ఈమేరకు బ్రిటన్ కు చెందిన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్ రామస్వామి మాట్లాడుతూ.. రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ట్రంప్ గెలుచుకుంటే ఉపాధ్యక్ష పదవికి పోటీ పడతానని చెప్పారు. తన వయసుకు అది మంచి పదవేనని వివరించారు. వైట్ హౌస్ లో కీలక స్థానంలో ఉన్నప్పుడే అమెరికాను ప్రక్షాళన చేసే అవకాశం వస్తుందని, దానికోసం అవసరమైతే ట్రంప్ తో కలిసి పోటీ చేయడానికి సిద్ధమన్నారు.

USA
Presidential Elections
vivek ramaswamy
Donald Trump
republicans
  • Loading...

More Telugu News